
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 19న తమ ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ నోటీసుల్లోని అంశాల్లోకి వెళితే.. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద రోహిత్‌రెడ్డికి ఈడీ సమన్లు జారీ చేసింది. ఇవి 2002 ECIRలో నమోదైన కేసుకు సంబంధించినవని ఈడీ తెలిపింది. సమన్ నోటీసుల్లో ప్రధానంగా 10 అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
రోహిత్ రెడ్డికి ఈడీ సమన్లలోని ముఖ్యాంశాలివీ..
- ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యేటప్పుడు కుటుంబ సభ్యుల వివరాలను రోహిత్ రెడ్డి సమర్పించాలి.
- స్థిర, చరాస్తులకు సంబంధించిన వివరాలను రోహిత్ రెడ్డి అందించాలి.
- ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, పాన్ కార్డ్ తీసుకొని రావాలి.
- రోహిత్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో ఉన్న సేల్ డీడ్, ఇన్వాయిస్ కాపీలు తేవాలి.
- ఆస్తుల కొనుగోలుకు సంబంధించి సోర్స్ ఆఫ్ ఫండ్ వివరాలను తెలియజేయాలి.
- రోహిత్ పేరుపై ఉన్న కంపెనీలు, ఫామ్స్, ట్రస్టుల వివరాలను అందించాలి.
- రోహిత్ ఆధీనంలో ఉన్న కంపెనీల వివరాలను సమర్పించాలి.
- కుటుంబ సభ్యుల పేరుపై ఉన్న కంపెనీల వివరాలను అందించాలి.
- కంపెనీల షేర్లు, ఆస్తుల వివరాలను సమర్పించాలి.
- 2015 నుంచి ఇప్పటివరకు బ్యాలెన్స్ షీట్స్, కంపెనీల స్థిర, చరాస్తులతో పాటు లోన్స్, లోన్ అగ్రిమెంట్స్ వివరాలను సమర్పించాలి.