
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసులో ఈడీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎలాంటి ముందస్తు ఆర్డర్లు పాస్ చేయొద్దంటూ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు వినకుండా ఎలాంటి నిర్ణయాలు వెల్లడించరాదని కోర్టును కోరింది.
ఈడీ కేసులో మార్చి 11న విచారణ ఎదుర్కొన్న కవితను.. మార్చి 16న మరోసారి విచారణకు రావాలని ఆదేశించింది. అయితే ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ కవిత సుప్రీంలో పిటిషన్ వేసింది. కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై తక్షణ విచారణకు సుప్రీం కోర్టు నిరాకరించింది. మార్చి 24న విచారణ చేపడతామని స్పష్టం చేసింది.
ఈ క్రమంలో కవిత పిటిషన్ పై ఈడీ కేవియట్ పిటిషన్ వేసింది. దీంతో ఇరు వర్గాల పిటిషన్లపై మార్చి 24 న సుప్రీంలో విచారణ జరగనుంది. ఈడీతో పాటు కవిత తరపు లాయర్ వాదనలు వినిపించనున్నారు.