ల్యాండ్ క్రూజర్ల కేసులో ఈడీ తనిఖీలు.. కార్ల డీలర్ బసరత్ ఖాన్ ఇంట్లో సోదాలు

ల్యాండ్ క్రూజర్ల కేసులో ఈడీ తనిఖీలు.. కార్ల డీలర్ బసరత్ ఖాన్ ఇంట్లో సోదాలు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ల్యాండ్‌‌‌‌‌‌‌‌ క్రూజర్ల స్మగ్లింగ్ కేసులో ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ డైరెక్టరేట్‌‌‌‌‌‌‌‌(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. దుబాయ్‌‌‌‌‌‌‌‌, శ్రీలంక నుంచి ఇంపోర్టెడ్‌‌‌‌‌‌‌‌ కార్లు స్మగ్లింగ్‌‌‌‌‌‌‌‌ చేసిన ఎస్‌‌‌‌‌‌‌‌కే కార్ లాంజ్‌‌‌‌‌‌‌‌ షోరూమ్‌‌‌‌‌‌‌‌ ఓనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బసరత్ అహ్మద్‌‌‌‌‌‌‌‌ ఖాన్‌‌‌‌‌‌‌‌ ఇంటితో పాటు షోరూమ్‌‌‌‌‌‌‌‌లోశుక్రవారం సోదాలు నిర్వహించింది. 

కార్ల స్మగ్లింగ్‌‌‌‌‌‌‌‌ వ్యవహారంలో అహ్మదాబాద్ డీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ యూనిట్‌‌‌‌‌‌‌‌ నమోదు చేసిన కేసు ఆధారంగా హైదరాబాద్ ఈడీ యూనిట్‌‌‌‌‌‌‌‌ అధికారులు ఫారిన్‌‌‌‌‌‌‌‌ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌(ఎఫ్‌‌‌‌‌‌‌‌ఈఎమ్‌‌‌‌‌‌‌‌ఏ) కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా గచ్చిబౌలిలోని షోరూమ్‌‌‌‌‌‌‌‌తో పాటు జూబ్లీహిల్స్‌‌‌‌‌‌‌‌లోని బసరత్ ఖాన్‌‌‌‌‌‌‌‌ ఇంట్లో నాలుగు గంటల పాటు సోదాలు నిర్వహించారు.

20 మందితో కూడిన రెండు బృందాలు తనిఖీల్లో పాల్గొన్నాయి. రూ.కోట్లు విలువ చేసే ఇంపోర్టెడ్‌‌‌‌ కార్లకు చెందిన ఇన్‌‌‌‌వాయిస్‌‌‌‌లు, ఇతర డాక్యుమెట్లు స్వాధీనం చేసుకున్నారు. రెండేండ్లుగా ఇతర దేశాల నుంచి దిగమతి చేసుకున్న కార్లను ఎవరెవరికి విక్రయించారనే వివరాలు సేకరించారు. ఆయా కార్లకు సంబంధించిన కస్టమ్స్‌‌‌‌ డ్యూటీ సహా ఇతర పన్నులను చెల్లించారా? లేదా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

స్టీరింగ్‌‌‌‌ మార్చి.. ట్యాక్స్‌‌‌‌లు ఏమార్చి..
ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ మాఫియా యూఎస్, జపాన్ నుంచి ఇంపోర్టెడ్‌‌‌‌ కార్లను ఇండియాకు అక్రమంగా తరలిస్తోంది. ఇంపోర్టెడ్‌‌‌‌ కార్లకు విదేశాల్లో లెఫ్ట్‌‌‌‌ సైడ్​డ్రైవ్‌‌‌‌ ఆప్షన్​ఉండగా, ఇండియాకు స్మగ్లింగ్‌‌‌‌ చేసే ముందు ఆయా కార్లను రైట్ సైడ్ డ్రైవింగ్‌‌‌‌కు అనుగుణంగా మార్చి దుబాయ్, శ్రీలంక మీదుగా ఇండియాకు తరలిస్తున్నారు. ఇలాంటి కార్లను గచ్చిబౌలిలోని ఎస్‌‌‌‌కే కార్‌‌‌‌‌‌‌‌ లాంజ్‌‌‌‌ షోరూమ్ ఓనర్‌‌‌‌‌‌‌‌ బసరత్ అహ్మద్‌‌‌‌ ఖాన్‌‌‌‌ కొనుగోలు చేసి, నకిలీ పత్రాలతో తక్కువ రేట్లకు విక్రయిస్తున్నాడు.

ఇందులో హైఎండ్‌‌‌‌ ల్యాండ్ క్రూజర్లు సహా లగ్జరీ కార్లు ఉన్నాయి. 2023 అక్టోబర్ 16న దిగుమతి చేసుకున్న లెక్సస్ ఎల్‌‌‌‌ఎక్స్‌‌‌‌ 500డి కారును రూ.50 లక్షలు తక్కువకు, 2024 ఫిబ్రవరి16న టయోటా ల్యాండ్ క్రూజర్ 300 మోడల్‌‌‌‌ కారును రూ. 20 లక్షలు తక్కువకు కొనుగోలు చేశాడు. ఈ క్రమంలోనే మార్చి 1న రోల్స్ రాయిస్ కల్లినన్ లగ్జరీ కారును రూ.1.24 కోట్లు తక్కువ ధరతో దిగుమతి చేసుకున్నాడు.

తక్కువ ధరకు స్మగ్లింగ్‌‌‌‌ కార్ల కొనుగోలు..
బసరత్ ఖాన్‌‌‌‌ కొనుగోలు చేసిన స్మగ్లింగ్‌‌‌‌ కార్లను హైద రాబాద్‌‌‌‌లోని ప్రముఖ రాజకీయ నేతలు, వ్యాపారవేత్తలు తక్కువ రేట్లకు కొనుగోలు చేశారు. ఇంపోర్టెడ్ కార్లు మార్కెట్‌‌‌‌ రేట్‌‌‌‌ కంటే తక్కువ ధరకు లభించడం తో ఎక్కువ ఆసక్తి చూపారు. దీంతో స్మగ్లింగ్‌‌‌‌ కార్ల వ్యవహారంపై అహ్మదాబాద్ డీఆర్‌‌‌‌‌‌‌‌ఐ, కస్టమ్స్‌‌‌‌ ఏజెన్సీలు దుబాయ్‌‌‌‌, శ్రీలంక నుంచి ఇంపోర్ట్‌‌‌‌ చేసిన కార్ల వివరాలతో విచారణ జరిపాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌‌‌‌ గచ్చిబౌలికి చెందిన ఎస్‌‌‌‌కే కార్ లాంజ్‌‌‌‌ను గుర్తించారు. నిర్వాహకుడు బసరత్ ఖాన్‌‌‌‌ను ఈ ఏడాది మేలో అహ్మదాబాద్ డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు.

ఫోర్జరీ డాక్యుమెంట్లతో 8 కార్లు కొనుగోలు చేశాడని, దీని ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రూ.25 కోట్ల నష్టం వాటి ల్లిందని గుర్తించారు. బసరత్ ఖాన్‌‌‌‌తో మాజీ మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు లింకులు ఉన్నాయని, ఆయన వాడుతు న్న ల్యాండ్ క్రూజర్లు కూడా స్మగ్లింగ్ ​చేసినవేనని కేంద్ర మంత్రి బండి సంజయ్‌‌‌‌ ఇటీవల ఆరోపించారు. దీనిపై రాష్ట్ర సర్కార్ విచారణ చేపట్టాలని డిమాండ్​చేశారు. దీంతో గత బీఆర్ఎస్ హయాంలో మంత్రుల కోసం కొనుగోలు చేసిన, అలాగే కేటీఆర్ వాడుతున్న ల్యాండ్ క్రూజర్ల కొనుగోళ్లపై విచారణ జరపాలని రవాణా శాఖను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.