రాబర్ట్ వాద్రాపై ఈడీ చార్జ్షీట్.. సంజయ్ భండారీ మనీ లాండరింగ్ కేసులో దాఖలు

రాబర్ట్ వాద్రాపై ఈడీ చార్జ్షీట్.. సంజయ్ భండారీ మనీ లాండరింగ్ కేసులో దాఖలు

ఢిల్లీ: యూకే ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాపై ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జ్‌‌‌‌షీట్ దాఖలు చేసింది. గురువారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు ఈడీ అధికారులు చార్జ్ షీట్ సమర్పించారు. 2016లో భండారీ ఇండ్లు, సంస్థలపై  ఐటీ అధికారులు రెయిడ్స్ చేసి పలు మెయిల్స్, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.

 వాటి ఆధారంగా  పీఎంఎల్ఏ యాక్ట్ కింద ఈడీ కేసు నమోదు చేసింది. భండారీ, వాద్రా మధ్య లింకులు, విదేశాల్లో వాద్రాకు ఆస్తులు ఉన్నట్టు సూచించే ఆధారాలు వాటిలో ఉన్నాయని ఈడీ అధికారులు చెప్తున్నారు. అయితే ఇది వాద్రాపై ఈడీ దాఖలు చేసిన రెండో చార్జ్​షీట్. హర్యానాలోని షికోహ్‌‌‌‌పూర్‌‌‌‌లో జరిగిన భూ ఒప్పందంలో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ నమోదైన కేసులో ఈ ఏడాది జులై లో వాద్రాపై ఈడీ మొదటి చార్జ్​షీట్​వేసింది.