HCA స్కామ్.. రూ. 90 లక్షల క్విడ్ ప్రో కో ..టెండర్లు లేకుండానే పనులు

HCA స్కామ్.. రూ. 90 లక్షల క్విడ్ ప్రో కో ..టెండర్లు లేకుండానే పనులు

హెచ్ సీఏలో  లో క్విడ్ ప్రోకో జరిగినట్టు ఈడీ గుర్తించింది.  టెండర్లు లేకుండా అనుకూల వారికే పనులు కేటాయించడంతో HCA సభ్యులు భారీగా లబ్ది పొందినట్టు తెలుస్తోంది.  కొద్ది రోజుల క్రితమే HCA మాజీ ట్రెజరర్ సురేందర్ అగర్వాల్ , అతడి భార్యను విచారించిన ఈడీ ..రూ. 90 లక్షలు క్విడ్ ప్రో కో జరిగినట్లు చెబుతోంది.  క్రికెట్ బాల్స్ టెండర్లు, జిమ్ సామాను టెండర్లు, స్టేడియం కుర్చీలు టెండర్ లు తమకు  కేటాయించినందుకు లక్షల రూపాయలు లంచం తీసుకున్నారు.   HCA ట్రెజరర్ సురేందర్ అగర్వాల్ భార్య పేరు మీద JB jewelers  ఖాతాలోకి లంచం డబ్బులు జమ అయినట్లు గుర్తించారు.

 బీసీసీఐ నుంచి హెచ్ సీఏకు  ప్రతి ఏటా దాదాపు రూ.100 కోట్లకు వరకు నిధులు వస్తాయి. వీటిలో భారీగా నిధులు దారిమళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఐడీ రికార్డ్‌ చేసిన స్టేట్‌మెంట్లను కూడా ఈడీ పరిగణనలోకి తీసుకోనున్నది. అయితే బీసీసీఐ నుంచి వచ్చిన నిధులను క్రికెట్ అభివృద్ధి కోసం కాకుండా సొంత పనులకు వాడినట్టు ఆరోపణలు ఉన్నాయి.  స్టేడియం టెండర్ల నుంచి  మొదలుకుని టికెట్ల విక్రయం దాకా అన్నిట్లో గోల్ మాట్ జరిగినట్లు తేల్చింది ఈడీ. 

గత 10 ఏళ్లలో BCCI నుంచి HCA కు 800కోట్లకు పైగా  నిధులు  వచ్చాయి.  కోట్ల రూపాయలు ఉన్న HCA అకౌంట్ ను సైతం సొంత ప్రయోజనాలకు వాడారని ఆరోపణలు ఉన్నాయి.  2022 లో జస్టిస్ లావ్ నాగేశ్వర్ రావ్ విచారణలో అనేక విషయాలు బట్టబయలు అయ్యాయి.   క్రికెట్ బాల్స్, స్టేడియం చైర్స్, జిమ్ పరికరాలు టెండర్లలో కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్టు ఫోరెన్సిక్ ఆడిట్ లో నిర్ధారణ అయ్యింది.   ఈ వ్యవహారం పై గతంలోనే HCA సభ్యులను విచరించింది  ఈడీ.  

HCA  అధ్యక్షుడు జగన్ మోహన్ రావ్ సైతం ఇదే రీతిలో అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.  HCA లోకి ఎంట్రీ కావడానికి ఎవరెవరికి ఎంత ఇచ్చారో తేల్చే పనిలో పడింది ఈడీ. IPL మ్యాచ్ ల సందర్భంగా టెండర్ల విషయంలోనూ జగన్ మోహన్ రావు  సొంత వాళ్లకే ప్రయోజనాలు చేకూరేలా వ్యవహరించారని సమాచారం. ఫుడ్ క్యాటరింగ్, స్టేడియంలో స్టాల్స్, టికెట్స్   కేటాయింపు  లోనూ తన వారికే కట్టబెట్టుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. వీటన్నింటిపైన ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.