
టీఎస్ పీఎస్ సీ(TSPSC) పేపర్ లీక్ కేసుపై ఈడీ దృష్టి పెట్టింది. డబ్బులన్నీ హవాలా మార్గంలో జరిగినట్లు ఈడీ అనుమానిస్తోంది. సిట్ దర్యాప్తు జరిపిన పత్రాలను కోర్టు నుంచి తీసుకునే యోచనలో ఈడీ ఉన్నట్లు తెలుస్తోంది. సిట్ అదుపులో ఉన్న నిందితులను విచారిస్తే హవాలా లావాదేవీల గురించి బయటపడే అవకాశం ఉంది.
మరో వైపు పేపర్ లీక్ కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. ముగ్గురు నిందితులను సీసీఎస్ నుంచి హిమాయత్ నగర్ సిట్ ఆఫీస్ కి తరలించారు పోలీసులు. నిందితులు శమీమ్, సురేష్, రమేష్ లను మూడోరోజు విచారిస్తోంది సిట్.
మార్చి 30న ముగ్గురు నిందితుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారు సిట్ అధికారులు. ఎల్బీనగర్, ఉప్పల్, సైదాబాద్ లో నిందితులను తీసుకెళ్లి విచారించారు. గ్రూప్ 1 కి సంబంధించిన మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు.