Anil Ambani: అనిల్ అంబానీకి షాక్.. మరోసారి విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు..

Anil Ambani: అనిల్ అంబానీకి షాక్.. మరోసారి విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు..

ED on Anil Ambani: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) మరోసారి రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీకి నోటీసులు పంపించింది. అయితే ఈసారి నవంబర్ 14 న దర్యాప్తులో భాగంగా హాజరు కావాలని ఆదేశించింది. ప్రధానంగా బ్యాంకు రుణ మోసాలు, మనీలాండరింగ్ కేసు సంబంధించి విచారణ కోసం సమన్లు జారీ చేసినట్లు వెల్లడైంది. దీంతో 66 ఏళ్ల వ్యాపారవేత్తను ఈడీ ఆగస్టులో కూడా ప్రశ్నించాక మరోసారి విచారణకు హాజరు కావాలని కోరింది. అనిల్ అంబానీ సంస్థలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకున్న లోన్స్ కేసులో భాగంగా ప్రస్తుతం అనిల్ అంబానీపై తాజాగా విచారణ జరుగుతోంది.

ఇప్పటికే ప్రభుత్వ సంస్థలు అనిల్ అంబానీకి సంబంధించిన 7,500 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు జప్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు రూ.17వేల కోట్ల లోన్ ఫ్రాడ్ కేసుగా పరిగణించబడుతోంది. గతంలో ED అనిల్ అంబానీని విచారించినప్పుడు.. అతను ఈ మంజూరు చేసిన రుణాల గురించి పూర్తి అవగాహన లేదని చెప్పగా.. ముఖ్య అధికారులను కూడా విచారించబోతున్నట్లు సమాచారం. ఈడీ రిలయన్స్ గ్రూప్‌కు చెందిన వ్యాపార లావాదేవీలను, డిజిటల్ రికార్డులను, పత్రాలను స్వాధీనం ఇప్పటికే స్వాధీనం చేసుకుంది.

ఈ విచారణల ద్వారా అనిల్ అంబానీ గ్రూప్‌పై ఉన్న ఆర్థిక అవినీతులపై దర్యాప్తు తీవ్రతరం అవుతోంది. ఈ వార్తల నేపథ్యంలో అనిల్ అంబానీకి సంబంధించిన లిస్టెడ్ కంపెనీల షేర్లు భారీగా దెబ్బతింటున్నాయి. చాలా ఏళ్ల తర్వాత తిరిగి పుంజుకుంటున్న షేర్లలో ఇలా జరగటంపై ఇన్వెస్టర్లు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.