మనీలాండరింగ్ కేసులో..ముగ్గురు వివో ఎగ్జిక్యూటివ్‌ల అరెస్టు

మనీలాండరింగ్ కేసులో..ముగ్గురు వివో ఎగ్జిక్యూటివ్‌ల అరెస్టు

న్యూఢిల్లీ :  మనీలాండరింగ్ కేసులో ముగ్గురు వివో- ఇండియా ఎగ్జిక్యూటివ్‌లను ఈడీ అరెస్టు చేసింది. వివో  సీఈఓ హాంగ్ జుక్వాన్ అలియాస్ టెర్రీ, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌ఓ) హరీందర్ దహియా, కన్సల్టెంట్ హేమంత్ ముంజాల్‌లను ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్‌ఏ) కింద అదుపులోకి తీసుకున్నారు. నిందితులను కోర్టు ఈడీ కస్టడీకి పంపించింది. ఈ కేసులో మొబైల్ కంపెనీ లావా ఇంటర్నేషనల్ ఎండీ హరి ఓమ్ రాయ్

చైనా జాతీయుడు గ్వాంగ్వెన్ అలియాస్ ఆండ్రూ కువాంగ్, చార్టర్డ్ అకౌంటెంట్లు నితిన్ గార్గ్, రాజన్ మాలిక్‌లను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గతంలో అరెస్టు చేసింది.  భారతదేశంలో పన్నులు చెల్లించకుండా ఉండటానికి వివో-ఇండియా చైనాకు 62,476 కోట్ల రూపాయలను  చట్టవిరుద్ధంగా  బదిలీ చేసిందని ఈడీ ఆరోపించింది.