హీరా గోల్డ్ ఓనర్ నౌహెరా షేక్‌కు ఈడీ భారీ షాకిచ్చింది. నౌహెరా షేక్ కు సంబంధించి అటాచ్ చేసిన రూ. 19.64 ఆస్తులను నవంబర్ 21న వేలం వేశారు . వేలం ద్వారా వచ్చిన డబ్బులని బాధితులకు నష్టపరిహారంగా ఇవ్వనుంది ఈడీ.
దేశవ్యాప్తంగా పెట్టుబడిదారుల నుంచి రూ. 5,978 కోట్ల మోసం చేశారు నౌహెరా షేక్. సంవత్సరానికి 36శాతం లాభం పేరుతో భారీగా డబ్బు సేకరించింది నౌహెరా షేక్. నౌహెరా షేక్ అక్రమ ఆస్తులు ఇప్పటివరకు రూ. 428 కోట్లు అటాచ్ చేసింది ఈడీ .
సుప్రీం కోర్టు అనుమతితో MSTC ద్వారా ఆస్తుల వేలం వేస్తోంది ఈడీ. ఇప్పటివరకు మొత్తం వేలం ద్వారా రూ. 93.63 కోట్లు రాబట్టినట్టు సమాచారం. ఇంకా మరిన్ని ఆస్తులను త్వరలో వేలం వేయనున్నట్లు ఈడీ వెల్లడించింది. వేలం ద్వారా వచ్చిన మొత్తం పూర్తిగా బాధితులకు తిరిగి ఇవ్వడానికి చర్యలు తీసుకుంటుంది ఈడీ.
