
న్యూఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్‌కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. శుక్రవారం విచారణకు హాజరుకావాలంటూ బుధవారం నోటీసులు ఇచ్చింది. ఇంతకుముందు జనవరి 3, 18, పోయినేడాది డిసెంబర్21, నవంబర్ 2న కేజ్రీవాల్‌కు ఈడీ నోటీసులు ఇవ్వగా.. ఆయన విచారణకు హాజరుకాలేదు. దీంతో తాజాగా ఐదోసారి నోటీసులు ఇచ్చింది.
ఈ నోటీసులను తమ లీగల్ టీమ్ స్టడీ చేస్తోందని ఆప్ తెలిపింది. ఏంచేయాలనే దానిపై చట్టప్రకారం నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న కేజ్రీవాల్.. ఈడీ విచారణకు తప్పనిసరి హాజరుకావాలని బీజేపీ డిమాండ్ చేసింది. ‘ఇంతకుముందు ఈడీ నోటీసులు ఇచ్చినప్పుడు కేజ్రీవాల్ టూర్ కు వెళ్లారు. మళ్లీ ఇప్పుడు కూడా ఆప్ అలాంటి ప్లాన్ చేస్తుందేమో చూడాలి’ అంటూ విమర్శలు చేసింది.