దావూద్ సోదరి ఇంట్లో ఈడీ సోదాలు

దావూద్ సోదరి ఇంట్లో ఈడీ సోదాలు

గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం సోదరి ఇంట్లో ఈడీ అధికారులు దాడులు చేశారు. సీజ్ చేసిన దావూద్ ఇబ్ర‌హీమ్ సోద‌రి హ‌సీనా పార్క‌ర్ ఇంటిని అధికారులు సోదాలు చేశారు. అండ‌ర్‌వ‌ర‌ల్డ్ తో లింకున్న మ‌నీల్యాండ‌రింగ్ కేసులో ఇవాళ ఈడీ ప‌లు ప్ర‌దేశాల్లో సోదాలు నిర్వ‌హిస్తోంది. రియ‌ల్ ఎస్టేట్ బ్రోక‌ర్ ఇక్బాల్ మిర్జీని కూడా సెర్చ్ చేస్తున్నారు. అండ‌ర్‌ వ‌ర‌ల్డ్ నేర‌స్థుల‌తో పాటు కొంద‌రు రాజ‌కీయవేత్త‌ల‌ను కూడా ఈడీ ప్ర‌శ్నిస్తోంది. 

అందులో భాగంగానే ముంబైలో ఉన్న హ‌సీనా ఇంటికి కూడా వెళ్లారు. ప్రాప‌ర్టీ సంబంధిత లావాదేవీల గురించి ఈడీ ఆరా తీస్తున్న‌ది. ముంబైలోని సుమారు ప‌ది ప్రాంతాల్లో ఈడీ సోదాలు కొన‌సాగుతున్నాయి. ఇటీవ‌ల ఎన్ఐఏ న‌మోదు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ ఆ త‌నిఖీలు చేప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. దావూద్ ఇబ్ర‌హీం గ్యాంగ్ ముంబైలో ఇంకా అక్ర‌మ వ‌సూళ్ల దందాకు పాల్ప‌డుతున్న‌ట్లు అధికారులు ఆరోపిస్తున్నారు.

మేము ముంబై, పరిసర ప్రాంతాల్లో 10 చోట్ల దాడులు నిర్వహిస్తున్నాము. గతంలో నమోదైన మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఈ దాడులు చేస్తున్నామన్నారు. ఓ ఆస్తి వ్యవహారానికి సంబంధించి విచారణను ముమ్మరం చేశాము. ఇందులో ఓ రాజకీయ నేత హస్తం ఉన్నట్టు మేము అనుమానిస్తున్నాము” అని ఈడీ వర్గాలు తెలిపాయి. గతంలో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ ఐఏ) నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ ఈ కేసును రిజిష్టర్ చేసింది. కేసుకు సంబంధించి దావూద్ అనుచరుల, పలువురు రాజకీయ నాయకుల మనీ ట్రాన్సక్షన్ వివరాలను ఈడీ సేకరిస్తున్నట్టు సమాచారం.
 

ఇవి కూడా చదవండి: