రైల్వే కాంట్రాక్టర్ ఇంట్లో 30 గంటలుగా ఈడీ సోదాలు

రైల్వే కాంట్రాక్టర్ ఇంట్లో 30 గంటలుగా ఈడీ సోదాలు

సికింద్రాబాద్, వెలుగు: రైల్వే కాంట్రాక్టర్ ఇజాజ్​ఫారూఖ్ నివాసంలో ఈడి సోదాలు ఆదివారం కూడా కొనసాగాయి. హైదరాబాద్, తార్నాకలోని ఆయన ఇంట్లో గత 30 గంటలుగా ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ఇజాజ్ ఫారూఖ్ కాట్రాక్ట్​పనులు నిర్వహిస్తున్న కే అండ్ ఆర్​ రైల్వే ఇంజనీరింగ్ కంపెనీ ద్వారా రూ.100 కోట్ల దాకా నకిలీ బిల్లులు తయారు చేసి కుంభకోణానికి పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. ఇజాజ్ అనేక అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం లభించడంతో కొద్ది రోజుల క్రితమే సీబీఐపై దాడులు చేసి కేసు నమోదు చేసింది. సీబీఐ కేసు ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ అధికారులు అతని ఇంట్లో విలువైన డాక్యుమెంట్లు, భారీ మొత్తంలో క్యాష్ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇజాజ్ కు తార్నాక విజయపురి కాలనీలో  3 వేల చదరపు గజాల విస్తీర్ణంలో విలాసవంతమైన భవనం ఉన్నట్లు గుర్తించారు. తన బర్త్ డేలకు  సినీ స్టార్లను, ప్రముఖులను ఆహ్వానించి గానాబజానా ఏర్పా టు చేసి, లక్షల విలువైన గిఫ్ట్​లు కూడా ఇచ్చిన ట్లు తెలిసింది. అయితే, సోదాల్లో దొరికిన డాక్యుమెంట్లు, క్యాష్ వివరాలను ఈడీ ఇంకా బయటపెట్టలేదు. సోదాల సమయంలో తనకు గుండెనొప్పి వచ్చిందంటూ ఇజాజ్ చెప్పడంతో ఈడీ అధికారులు హాస్పిటల్​ తీసుకెళ్లి టెస్టులు  చేయించారు. బాగానే ఉందని డాక్టర్లు చెప్పడంతో తిరిగి ఇంటికి తీసుకువచ్చి సోదాలు కొనసాగించారు. కవరేజీకి వచ్చిన మీడియా ప్రతినిధులపై ఇజాజ్ అనుచరులు దాడికి సైతం ప్రయత్నించారు.