హైదరాబాద్, వెలుగు: గ్రూప్ 2 అభ్యర్థులు చేసిన అప్లికేషన్లను సవరించుకునేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) అవకాశం ఇచ్చింది. ఈ నెల16న ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ అప్లికేషన్లను ఎడిట్ చేసుకోవచ్చని కమిషన్ ఓ ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు తమ పేరు, జెండర్, డేటాఫ్ బర్త్, కమ్యూనిటీ, ఇతర అంశాలను మరోసారి చెక్ చేసుకోవాలని సూచించింది.
