చదువుకున్న అమ్మాయిలు ఇలా చేయవచ్చా..? : కేంద్రమంత్రి కౌషల్ కిషోర్

చదువుకున్న అమ్మాయిలు ఇలా చేయవచ్చా..? : కేంద్రమంత్రి కౌషల్ కిషోర్

ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం రేపిన శ్రద్ధా వాకర్ హత్యపై కేంద్రమంత్రి కౌషల్ కిషోర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చదువుకున్న అమ్మాయిలు ఇలా చేయవచ్చా..?  అంటూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్న అమ్మాయిలను తప్పుపట్టారు. శ్రద్ధా హత్యకు స్వయంగా ఆమే కారణమన్నారు.  తల్లిదండ్రులను వదిలి బాయ్‌ఫ్రెండ్‌తో సహజీవనం చేసే చదువుకున్న యువతులను నిందించాల్సి ఉంటుందన్నారు. ఈ ఘటనకు (శ్రద్ధ హత్యకు) పూర్తి బాధ్యత ఆమెదేనని ఆరోపించారు. సహజీవనానికి ఆమె తల్లి, తండ్రి వ్యతిరేకించారని, చదువుకున్న శ్రద్ధ తీసుకున్న ఈ నిర్ణయంతోనే ఇలా జరిగిందని చెప్పారు. సహజీవనం చేయడం ఆమె పొరపాటన్న మంత్రి... మీరు నిజంగా ఎవరితోనైనా ప్రేమలో పడితే ముందుగా పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. ఈ లివ్-ఇన్ రిలేషన్లు ఏమిటి? ఇలాంటి పద్ధతులు నేరాలను ప్రోత్సహిస్తాయన్నారు.

మంత్రి కిషోర్ వ్యాఖ్యలపై శివసే నాయకురాలు ప్రియాంక చతుర్వేది స్పందించారు. ఈ దేశంలో పుట్టడానికి మహిళలే కారణమని చెప్పకుండా.. అత్యంత దారుణంగా స్త్రీలను కించపరుస్తూ కామెంట్ చేశారన్నారు.  ప్రధాని మోడీ నిజంగానే మహిళా శక్తి గురించి మాట్లాడి ఉంటే ఈ వ్యాఖ్యలు చేసిన కౌశల్‌ కిషోర్‌ను కేంద్ర మంత్రి పదవి నుంచి తొలగించాలని ఆమె డిమాండ్‌ చేశారు.