తెలంగాణ ఎడ్యుకేషన్... పాలసీలోకి ‘అక్షరవనం’: విద్యా కమిషన్ చైర్మన్ మురళి

తెలంగాణ ఎడ్యుకేషన్... పాలసీలోకి ‘అక్షరవనం’: విద్యా కమిషన్ చైర్మన్ మురళి

కల్వకుర్తి, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఎడ్యుకేషన్ పాలసీలో కల్వకుర్తి వందేమాతరం ఫౌండేషన్ అక్షరవనం బృందాన్ని  భాగస్వామిగా చేసిందని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలిపారు. సోమవారం కమిషన్ బృందం నాగర్​కర్నూల్​జిల్లా కల్వకుర్తిలోని అక్షరవనం సెంటర్​ను సందర్శించి, ఆవిష్కరణాత్మక అభ్యాస విధానాలపై చర్చించింది. 

తెలంగాణ ఎడ్యుకేషన్ అడ్వైజర్ కేశవరావు అక్షరవనం సందర్శించి, ప్రస్తుత విద్యా వ్యవస్థలో అవసరమైన సంస్కరణలపై విస్తృతమైన చర్చలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పాఠశాల విద్యపై అక్షరవనం బృందం తమ అభిప్రాయాలను తెలపనుందన్నారు. ఇందులో ఏఆర్సీ రీసెర్చ్ హెడ్  శ్రీపతి రెడ్డి పెడగాజీ కరిక్యులం వర్కింగ్ సెంటర్ లో సభ్యుడిగా నియమితులయ్యారు.