TS మోడల్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు ఆరోజే

TS మోడల్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు ఆరోజే

 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మోడల్‌ స్కూళ్లలో 2024-25 విద్యా సంవత్సరం నుంచి ప్రవేశం పొందడానికి ఏప్రిల్ 7న ఎంట్రన్స్ టెస్ట్  నిర్వహించారు. ఈ టెస్ట్ తో  6వ తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ఏడాది ప్రవేశాల కోసం మొత్తం 62,982 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకోగా వారిలో 51,525 మంది విద్యార్ధులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు.

తెలంగాణ మోడల్ స్కూల్స్ ఎంట్రన్స్ టెస్ట్-2024 ఆబ్జెక్టివ్‌ విధానంలో జరిగింది. మొత్తం 100 ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. తెలంగాణ మోడల్ స్కూల్స్ ఎంట్రన్స్ టెస్ట్-2024 ఫలితాలు మే 25న విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. అర్హత సాధించిన విద్యార్థులు మే 27 నుంచి మే 31వ తేదీ వరకు ప్రవేశాలు పొందవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 194 మోడల్ స్కూల్స్ ఉన్నాయి. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా సీలు కేటాయిస్తారు.