దసరా సెలవుల కుదింపు వార్తల్లో నిజం లేదు

దసరా సెలవుల కుదింపు వార్తల్లో నిజం లేదు

దసరా సెలవులను కుదిస్తారన్న వార్తలపై విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. సెలవులు తగ్గించే ఆలోచన లేదని స్పష్టం చేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూళ్లకు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు మొత్తం 14 రోజులు సెలవులుంటాయని చెప్పింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని  పాఠశాల విద్యాశాఖ అధికారులు చెప్పారు. 

ఆగస్టులో కురిసిన వర్షాలు, జాతీయ సమైక్యతా దినోత్సవం కారణంగా విద్యాసంస్థలకు 5 రోజులు సెలవులు ప్రకటించిందని, అందుకు గాను పాఠశాలలకు సెలవులను14 నుంచి 9 రోజులకు కుదించాలని ఎస్ఈఆర్టీ, విద్యాశాఖకు లేఖ రాసింది. ఆ సెలవులను భర్తీ చేసుకునేందుకు ఈ నెల 30 వరకు రాష్ట్రంలో పాఠశాలలు పని చేసే విధంగా నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఈ నేపథ్యంలో దసరా సెలవులను కుదిస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ స్పష్టత ఇస్తూ ప్రకటన జారీ చేసింది.