ఎన్‌ఈపీ ఎలా ఆలోచించాలో నేర్పుతుంది: మోడీ

ఎన్‌ఈపీ ఎలా ఆలోచించాలో నేర్పుతుంది: మోడీ

న్యూఢిల్లీ: కొత్తగా ప్రవేశపెట్టిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (ఎన్‌ఈపీ) 34 ఏళ్ల కిందటి పాత విద్యా విధానంలో అనూహ్య మార్పులు తీసుకొస్తుందని ప్రధాని మోడీ చెప్పారు. ఇది అందరిలో ఆత్మ విశ్వాసం నింపుతుందని అభిలషించారు. ఎన్‌ఈపీపై మోడీ పలు వ్యాఖ్యలు చేశారు. పాత విద్యా విధానం ఏం ఆలోచించాలనేలా ఉండేదని, కొత్త ఎన్‌ఈపీ ఎలా ఆలోచించాలనే దానిపై ఫోకస్ చేస్తుందన్నారు. ఇదే ఆ రెండింటిలో ఉన్న కీలక తేడా అన్నారు.

‘ఎన్‌ఈపీపై ఇండియా వ్యాప్తంగా ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. దీనిపై ప్రజలు తమ ఆలోచనలను పంచుకుంటున్నారు. ఈ పాలసీని పెద్ద ఎత్తున స్వాగతిస్తున్నారు. ఏ ఒక్కరు కూడా ఈ పాలసీ ఒక వైపు మొగ్గిందని చెప్పడం లేదు. ఇది గొప్ప విషయం. ధైర్యాన్ని నింపే అంశం. ఇప్పుడు అందరూ దీన్ని ఎలా అమలు చేస్తారని ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. స్టూడెంట్స్ తమ మాతృభాష, ప్రాంతీయ భాషలో చదవడం నేర్చుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్‌ను అర్థం చేసుకోవడం చాలా మెరుగవుతుంది. ఈ నేపథ్యంలో ఐదో క్లాస్ వరకు మాతృ భాషలో చదువుకోవడం చాలా హెల్ప్‌ అవుతుంది. ఒక్కసారి సబ్జెక్ట్‌ను అర్థం చేసుకుంటే భవిష్యత్ చాలా బాగుంటుంది’ అని పీఎం మోడీ చెప్పారు.