విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్లో ఆందోళన.. ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్..

విద్యాశాఖ కమిషనర్ ఆఫీస్లో ఆందోళన.. ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్ట్..

హైదరాబాద్ లోని లక్డీకపూల్ లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ లో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావాలంటీర్లను రెన్యూవల్ చేయాలంటూ.. కార్యాలయంలోని రోడ్డుపై బైఠాయించారు. మూడు నెలల నుంచి పెండింగులో ఉన్న వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఉద్యోగులకు మద్దతుగా ఎమ్మెల్యే రఘునందన్ రావు నిరసనలో పాల్గొన్నారు.

తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేవరకు రోడ్డుపై నుంచి కదిలేదే లేదని ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులకు, ఉద్యోగులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఎమ్మెల్యే రఘునంనద్ రావుని పోలీసులు అరెస్ట్ చేసి.. నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.