ఈ నగరానికి ఏమైంది? రీ రిలీజ్..టికెట్స్ ఆల్మోస్ట్ బుక్

ఈ నగరానికి ఏమైంది? రీ రిలీజ్..టికెట్స్ ఆల్మోస్ట్ బుక్

‘పెళ్లి చూపులు’ మూవీతో మ్యాజిక్‌ చేసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) రెండో చిత్రం ‘ఈ నగరానికి ఏమైంది’ (Ee Nagaraniki Emaindi). ఫ్రెండ్‌షిప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ 2018లో విడుదలైంది. 

ఈ మూవీ అప్పట్లో థియేటర్లలో అనుకున్నంత రిజల్ట్  రాబట్టలేకపోయినా..ఇప్పటికీ ఈ మూవీ మీమ్ పేజీల్లో పెద్ద సెన్సేషన్ అయింది. ఈ సినిమా సీన్లను మీమర్స్ నెటిజన్లు విపరీతంగా వాడుతుంటారు. అంతలా కనెక్ట్ అయ్యింది ఈ మూవీ. కనుకే ఈ మూవీని జూన్ 29న రీ రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఆల్మోస్ట్ రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్స్ బుక్ అయిపోయావని టాక్.

ఈ మూవీ ని అప్పట్లో మిస్ అయినా మీ యూత్ తో కలిసి చూడాలని తరుణ్ భాస్కర్ సోషల్ మీడియా లో తన ఫీలింగ్ ని పంచుకున్నాడు. అప్పట్లో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ నగరానికి ఏమైంది? రీ రిలీజ్ తో అంచనాలు పెంచేసింది. ' ఈ మూవీకు అప్పట్లో ఇలాంటి రెస్పాన్స్ వచ్చి ఉంటే గోవాలో ఇల్లు కొనే వాడిని అంటూ'  తరుణ్ భాస్కర్ ఫన్నీ గా స్పందించాడు.