
ఈ సాలా కప్ నమ్దే.. ఈ స్లోగన్ ఇండియా వైడ్ గా ఎంతో పాపులర్ అయింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతి సీజన్ లో ఈ డైలాగ్ చెప్పి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది. ఎన్నో సీజన్ లుగా ఈ డైలాగ్ చెప్పినా ఆర్సీబీని టైటిల్ వరించలేదు. ప్రతి సారి లాగే ఈ సారి కూడా ఫ్యాన్స్ ఈ సాలా కప్ నమ్దే..అంటూ ధీమాగా ఉన్నారు. అయితే ఆర్సీబీ జట్టు మాత్రమే ఈ సారి ఆ డైలాగ్ చెప్పలేదు. ఒకేసారి టైటిల్ గెలిచాక ఈ అద్భుతమైన డైలాగ్ చెప్పాలని భావించినట్టు ఉంది. అందుకే ఈ సీజన్ లో కోహ్లీతో పాటు మిగిలిన ప్లేయర్స్ ఈ సాలా కప్ నమ్దే జపం చేయలేదు.
ట్రోఫీ గెలిచాకే ఈ సాలా కప్ నమ్దే అనే డైలాగ్ చెప్పి ఆర్సీబీ ఫ్యాన్స్‌ను ఖుషీ చేశాడు. ఐపీఎల్ ఫైనల్ తర్వాత ప్రెజెంటేషన్ లో భాగంగా రజత్ పటిదార్ ను టైటిల్ అందుకోవాలని హర్ష భోగ్లే పిలిచాడు. ఫైనల్ గురించి మాట్లాడిన తర్వాత ట్రోఫీ తీసుకోవాల్సిందిగా ఆహ్వానించారు. ట్రోఫీ తీసుకునే ముందు పటిదార్..ముందుగా ఒక మాట చెప్పాలి అని స్టేడియంలో ఉన్న అభిమానులని చూసి అన్నాడు. 'ఈ సాల్ కప్ నమ్దు' అని చెప్పడంతో ఫ్యాన్స్ గట్టిగా అరిచారు. ఆ తర్వాత టైటిల్ అందుకున్న పటిదార్.. సెలెబ్రేట్ చేసుకొని కోహ్లీకి ఇచ్చాడు.
Also Read : సూర్యకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్.. ఐపీఎల్ 2025 అవార్డ్స్ లిస్ట్ ఇదే!
పటిదార్ కెప్టెన్ గా తన తొలి ప్రయత్నంలోనే ఆర్సీబీ జట్టుకు టైటిల్ అందించడం విశేషం. ఇన్నేళ్ళుగా ఆర్సీబీ జట్టులో ఎంతమంది కెప్టెన్ లు వచ్చి వెళ్లినా టైటిల్ గెలవాలనే కల అలాగే ఉండిపోయింది. అయితే పటిదార్ తన కెప్టెన్సీతో జట్టును నడిపిన విధానం అద్భుతం. బ్యాటర్ గా ఈ సీజన్ లో పెద్దగా రాణించకపోయినా కెప్టెన్ గా ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఒత్తిడిలో పటిదార్ తీసుకున్న నిర్ణయాలు ఫలించాయి. బెంగళూరు జట్టుకు టైటిల్ అందించిన తొలి కెప్టెన్ గా పటిదార్ నిలిచి మధురమైన జ్ఞాపకాలను అందించాడు.
ఫైనల్లో 16 బంతుల్లోనే 2 సిక్సర్లు.. ఒక ఫోర్ తో 26 పరుగుకు చేసి జట్టుకు కీలకమైన పరుగులు అందించాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మంగళవారం (జూన్ 3) అహ్మదాబాద్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఫైనల్లో 6 పరుగుల తేడాతో విజయం సాధించి తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. 17 ఏళ్లుగా ఎదురు చూసిన ట్రోఫీ 18వ ప్రయత్నంలో సాధించి తమ కప్ కళను నెరవేర్చుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ 7 వికెట్లకు 184 పరుగులకు పరిమితమైంది.
Rajat Patidar 🗣️ "𝐸𝑒 𝑠𝑎𝑙𝑎 𝑐𝑢𝑝 𝑛𝑎𝑚𝑑𝑢" pic.twitter.com/TZ6MR2SYtN
— ESPNcricinfo (@ESPNcricinfo) June 3, 2025