
నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ ‘బింబిసార’.. నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో మల్లిడి వశిష్ట దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ గురుపూర్ణిమ సందర్భంగా ‘ఈశ్వరుడే’ అంటూ సాగే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటకు చిరంతన్ భట్ స్వరాలను సమకూర్చగా శ్రీమణి లిరిక్స్ అందించారు. కాలభైరవ ఆలపించారు. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. కేథరిన్ థెరిసా, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ సినిమాని ఆగస్టు 5 న రిలీజ్ చేయనున్నారు. కళ్యాణ్ రామ్ కు ఇది 18 వ చిత్రం కావడం విశేషం.