కరోనా చాలా ప్రమాదకరమైన వైరస్ అనీ, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ డేవిడ్ నబారో సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా ఒకసారి తగ్గినా మళ్ళీ రాదని గ్యారెంటీ లేదన్నారు. కాబట్టి ప్రజలే తమ జీవన విధానాన్ని మార్చుకుని ఆరోగ్యకర అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. కరోనాను కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు కృషి చేస్తున్నాయన్న ఆయన, ప్రపంచ జనాభాకు సరిపడా వ్యాక్సిన్ అందుబాటులోకి రావాలంటే మరో రెండు సంవత్సరాల ఐదు నెలలు పడుతుందన్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మొదట వైరస్ ఎఫెక్ట్ ఎక్కువ ఉన్న దేశాలకు అందించాలని అన్నారు. ఇప్పటి వరకు ఏ దేశంలోనూ కరోనాకు ట్రీట్ మెంట్ లేదని తెలిపారు. అంతే కాకుండా ఏదైనా దేశం కరోనాకు చికిత్స ఉందంటే తమకు తెలిపాలని అన్నారు డేవిడ్.
