తూకం వేయగానే రైస్ మిల్లులకు తరలించాలి

తూకం వేయగానే రైస్ మిల్లులకు తరలించాలి

సదాశివనగర్, వెలుగు : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం వేసిన వెంటనే రైస్​ మిల్లులకు తరలించి ట్యాబ్​లలో నమోదు చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు పడేలా చూడాలని జిల్లా సహకార అధికారి రాంమోహన్​ అన్నారు. మంగళవారం మండలంలోని అడ్లూర్ ఎల్లారెడ్డి సొసైటీ పరిధిలోని రామారెడ్డి, పోసానిపేట్, ఉప్పల్​వాయి, మర్కల్, అడ్లూర్ ఎల్లారెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించి మాట్లాడారు. మాయిశ్చర్ వచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలని, అకాల వర్షాల కారణంగా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు.  కార్యక్రమంలో మానిటరింగ్ అధికారి సాయిలు, సొసైటీ చైర్మన్ మర్రి సదాశివరెడ్డి, వైస్​ చైర్మన్​ అమ్ముల పశుపతి, సీఈవో కడెం బైరయ్య, సిబ్బంది నవీన్​, గంగారాజు, లింగమూర్తి, బైరేశ్ తదితరులు పాల్గొన్నారు.

 వడ్ల కాంటా వేగం పెంచాలె

నిజామాబాద్, వెలుగు: అకాల వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున వడ్ల కాంటా వేగం పెంచాలని, తూకం వేయగానే రైస్​ మిల్లులకు తరలించాలని నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ కిరణ్​కుమార్ సూచించారు. మంగళవారం మాక్లూర్,  మాదాపూర్​లో ధాన్యం కొనుగోలు సెంటర్లను పరిశీలించి మాట్లాడారు. వర్షం నీటికి వడ్లు తడవకుండా టార్ఫాలిన్లు అందుబాటులో ఉంచాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో  హమాలీలు, లారీల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. గన్నీ బ్యాగులు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, తేమ శాతం కొలిచే మీటర్లు, గ్రెయిన్ క్యాలిపర్లు సరిపడా ఉండేలా చూసుకోవాలన్నారు. గ్రౌండ్​లో ఇబ్బందులుంటే తమ దృష్టికి తేవాలన్నారు. ఆయన వెంట డీఆర్డీవో సాయాగౌడ్​, డీపీఎం సాయిలు తదితరులు ఉన్నారు.