ఖమ్మంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

ఖమ్మంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం

ఖమ్మం టౌన్,వెలుగు:  మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యపైచేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా జిల్లా మున్నూరుకాపు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  శనివారం మయూరి సెంటర్ లో  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి  దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు పార నాగేశ్వరరావు మాట్లాడుతూ పొన్నాలపై చేసిన వ్యాఖ్యలను ఉపసహరించుకుని క్షమాపణ చెప్పాలని, లేకపోతే రేవంత్ ను రాష్ట్రంలో తిరగనిబోవ్వమని హెచ్చరించారు.

రాష్ట్రంలో బీసీలను అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. పార్టీలు మారే రేవంత్ కాపులను అవమానించడం సిగ్గుచేటన్నారు. బీసీలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు.