అభివృద్ధిలో మా వంతు పాత్ర పోషిస్తం : గ్రూప్ 1 అధికారుల సంఘం

అభివృద్ధిలో మా వంతు పాత్ర పోషిస్తం : గ్రూప్ 1 అధికారుల సంఘం

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ సమగ్రాభివృద్ధితో తమ పాత్రను పోషిస్తామని తెలంగాణ గ్రూప్ 1 అధికారుల సంఘం వెల్లడించింది. శుక్రవారం సెక్రటేరియేట్​లో సీఎం రేవంత్ రెడ్డిని అసోసియేషన్ అద్యక్షుడు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి హన్మంతు నాయక్ ఇతర నేతలు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ  అభివృద్ధిలో  తమ వంతు పాత్ర పోషిస్తామని సీఎంకు తెలిపారు.