మత్తు రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి: యాదాద్రి ఎస్పీ

మత్తు రహిత సమాజ నిర్మాణానికి కృషి చేయాలి: యాదాద్రి ఎస్పీ

యాదాద్రి, వెలుగు: మత్తు రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా కృషి చేయాలని యాదాద్రి ఎస్పీ అంక్షాంక్ష్​ యాదవ్​ పిలుపునిచ్చారు. శుక్రవారం భువనగిరిలో పోలీసులు 2కే రన్​ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించి మాట్లాడారు.

ప్రతి ఒక్కరూ మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకొని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్​ ఎస్పీ లక్ష్మీనారాయణ, డీఎస్పీ రవీందర్, ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్ రెడ్డి, సీఐలు ఉన్నారు.