ప్రజావాణితో సమస్యల పరిష్కారానికి కృషి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ప్రజావాణితో సమస్యల పరిష్కారానికి కృషి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్/నిర్మల్, వెలుగు : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి వచ్చిన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించేలా కృషి చేయాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో అడిషనల్ కలెక్టర్ దాసరి వేణు, ఆర్డీఓ లోకేశ్వరరావుతో కలిసి కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. దరఖాస్తులు పెండింగ్​లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు.

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని నిర్మల్​కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.  సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను ఆమె స్వీకరించారు. ప్రజా సమస్యలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

ధరణి, రెవెన్యూ, వ్యవసాయం, కొత్త రేషన్ కార్డులు, ఫించన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు, ఇతర భూ సమస్యల వంటి అంశాలపై ఫిర్యాదులు అధికంగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్, డీఆర్ఓ భుజంగరావు, ఆర్డీఓ రత్నకల్యాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.