ఆసియా అండర్‌‌‌‌‌‌‌‌–17 బాక్సింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్షిప్ ఫైనల్లో 8 మంది బాక్సర్లు

ఆసియా అండర్‌‌‌‌‌‌‌‌–17 బాక్సింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్షిప్ ఫైనల్లో 8 మంది బాక్సర్లు

తాష్కెంట్‌‌‌‌‌‌‌‌: ఆసియా అండర్‌‌‌‌‌‌‌‌–17 బాక్సింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా విమెన్‌‌‌‌‌‌‌‌ బాక్సర్ల పంచ్ అదిరింది. సోమవారం జరిగిన వివిధ కేటగిరీల్లో ఎనిమిది మంది బాక్సర్లు ఫైనల్లోకి అడుగుపెట్టి పతకాలు ఖాయం చేసుకున్నారు. 

రాఖీ (46 కేజీ), కుషి చాంద్‌‌‌‌‌‌‌‌ (48 కేజీ), నవ్య (57 కేజీ), దియా (63 కేజీ), హిమాన్షు (70 కేజీ), జ్యోతి (75 కేజీ), వాన్షికా (80 కేజీ), గురుసీరత్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌ (80+ కేజీ) తమ ప్రత్యర్థులపై విజయాలు సాధించి టైటిల్‌‌‌‌‌‌‌‌ ఫైట్‌‌‌‌‌‌‌‌కు అర్హత సాధించారు. మమతా మురళీధర్‌‌‌‌‌‌‌‌ (52 కేజీ), మంజునాథ్‌‌‌‌‌‌‌‌ లమాని (54 కేజీ), ఇషికా (60 కేజీ), హర్నూర్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌ (66 కేజీ) సెమీస్‌‌‌‌‌‌‌‌లో ఓడి బ్రాంజ్ మెడల్స్‌‌‌‌‌‌‌‌తో సరిపెట్టుకున్నారు.