
మెహిదీపట్నం, వెలుగు: ధూల్‌పేట్‌లో 8 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు ఎక్సైజ్‌పోలీసులు తెలిపారు. ధూల్‌పేట్‌లోని దిల్వార్ గంజ్ ప్రాంతంలో రాజ్ అలియాస్ కబూతర్ వాలా రాజాసింగ్, తుల్జారాం సింగ్ గంజాయి విక్రయిస్తున్నారు. పక్కా సమాచారంతో ఎస్టీఎఫ్ఏ టీం ఆదివారం దాడులు నిర్వహించింది. ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి గంజాయితోపాటు గంజాయి ప్రెస్సింగ్ మెషీన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు పేర్కొన్నారు.