టెక్నాలజీ ..గూగుల్ మ్యాప్స్​లో ఇవి కూడా..

టెక్నాలజీ ..గూగుల్ మ్యాప్స్​లో ఇవి కూడా..

తెలియని ప్లేస్​కి వెళ్లాలంటే వెంటనే గూగుల్ మ్యాప్​ ఓపెన్ చేస్తాం. అందులో మెయిన్ రూట్, షార్ట్​ కట్​, ట్రాఫిక్, లొకేషన్ డీటెయిల్స్ వంటివి కనిపిస్తాయి. అయితే, ఇప్పుడు ఇందులో మరో కొత్త అప్​డేట్ యాడ్​ అయింది. అదేంటంటే.. వీల్​ చెయిర్​లో వెళ్లడానికి, మెట్లు ఎక్కలేని వాళ్లకోసం సాఫీగా ఉండే దారుల్ని సజెస్ట్​ చేస్తుంది గూగుల్ మ్యాప్​. ఉదాహరణకు.. వీల్​ చెయిర్​లో వెళ్లడానికి సరైన రూట్​ చూపించమని అడిగితే.. వీల్ చెయిర్ ఐకాన్​ ఉన్న దారి చూపిస్తుంది. అంతేకాకుండా స్టెప్ ఫ్రీ ఎంట్రన్స్, రెస్ట్​రూమ్స్, పార్కింగ్ లేదా సీటింగ్ వంటి వాటిని కనిపెట్టేందుకు ఈ ఐకాన్​ని ఫాలో కావాలి. 

మ్యాప్​​లో లెన్స్ కూడా ఉంటుంది. ఇంతకుముందు అది ‘సెర్చ్ విత్ లైవ్​ వ్యూ’ అని వచ్చేది. అందులో కొత్త ప్లేస్​లను సెర్చ్ చేయడానికి ఫోన్​ కెమెరాలోకి వెళ్లి, ఎ.ఆర్., ఎ.ఐ. ఫీచర్స్ సాయం తీసుకోవాల్సి ఉండేది. కానీ, స్క్రీన్ రీడర్ కేపబిలిటీస్ ఇప్పుడు ఐఓఎస్​లో అందుబాటులోకి తెచ్చింది. వచ్చే ఏడాది ఆండ్రాయిడ్​లోకి కూడా ఈ ఫీచర్ వస్తుంది. దీన్ని వాడాలంటే కెమెరా ఐకాన్​ మీద ట్యాప్ చేసి, దగ్గర్లో ఉన్న ప్లేస్​ల గురించి ఫోన్​లో వచ్చే ఆడిటరీ ఫీడ్ బ్యాక్​ వినాలి. ఈ ఫీచర్ చదవడం రాని, స్పెల్లింగ్స్​ పలకలేని వాళ్లకు, లాంగ్వేజ్ లెర్నర్స్ కోసం, ఫాస్ట్​గా రిజల్ట్ కావాలనుకునేవాళ్లకు ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ డెస్క్​టాప్, మొబైల్స్​లో క్రోమ్​లో అందుబాటులో ఉంది.

అలాగే ఇప్పుడు షార్ట్​కట్ రూట్స్ సెలక్ట్ చేసుకుని, అందులో ఇమేజెస్​ని పర్సనలైజ్ చేసి హోమ్​ స్క్రీన్​లో సైజ్ అడ్జస్ట్ చేయొచ్చు. పర్సనలైజేషన్ చేయడం వల్ల కాగ్నిటివ్​ డిఫరెన్సెస్, డిజేబిలిటీస్ ఉన్నవాళ్లకు హెల్ప్ అవుతుందని స్టడీల్లో తేలింది. 

అదేకాకుండా.. గూగుల్ ఫ్రేమ్ ఫీచర్ పిక్సెల్8, పిక్సె 8 ప్రొ మోడల్స్​లో అందుబాటులో ఉంది. అది పెట్స్, డిషెస్, డాక్యుమెంట్స్, ఫేసెస్​ని ఈజీగా గుర్తిస్తుంది. ఈ ఏడాది ఈ ఫీచర్ పిక్సెల్ 6, పిక్సెల్ 7లో కూడా అందుబాటులోకి రానుంది.