అమీన్పూర్, వెలుగు: జర్నలిస్ట్ విఠల్పై జరిగిన దాడి కేసులో పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 8న ఉదయం 3 గంటల సమయంలో కొందరు వ్యక్తులు జర్నలిస్టు విఠల్ ఇంటిని ధ్వంసం చేసి అతడిపై దాడికి దిగారు. ఉదయం సీఐ నరేశ్‌కు జర్నలిస్టులతో కలిసి విఠల్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ విజయరావు పోలీస్ సిబ్బందితో కలిసి విచారణ జరిపారు. సీసీ కెమెరాలు, వీడియోలను పరిశీలించారు. మధు అలియాస్మధుసూదన్, వంశీ, నల్లమల్ల శివప్రసాద్, యుగేందర్, కొత్త సంపత్, కుంచాల బ్రహ్మయ్య, సల్లడి హరీశ్, కోడూరి స్వరాజ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.
తహసీల్దార్, జర్నలిస్టుపై దాడిని ఖండిస్తున్నాం
అమీన్పూర్ తహసీల్దార్ వెంకటేశ్, జర్నలిస్టు విఠల్పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఎం నాయకులు నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. బీరంగూడలో ఆదివారం పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు. అమీన్పూర్ మండల పరిధిలో కోట్ల విలువైన భూములు, పార్కు స్థలాలు, చెరువు కుంటలు కబ్జాలకు గురవుతున్నాయన్నారు. కబ్జాల నుంచి ప్రభుత్వ భూములను కాపాడాలన్నారు. కబ్జాదారులపై కేసులు నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ భూముల్లో జరిగిన ఆక్రమణలను తొలగించడానికి వెళ్లిన తహసీల్దార్‌పై, వార్తను కవరేజ్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం నాయకులు పాండురంగారెడ్డి, జార్జ్, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
