హైదరాబాద్, వెలుగు: వ్యాపార అవకాశాలను పెంచుకోవడానికి, ఆలోచలను పంచుకోవడానికి వ్యాపార విధానాలపై చర్చించడానికి హైదరాబాద్‌లో ఇన్‌స్టా మీట్ ఎనిమిదో ఎడిషన్ జరిగింది. ‘హైదరాబాద్ ఫుడ్ డైరీస్’ ద్వారా సుపరిచితుడైన ఫుడ్ ఇన్‌ఫ్లూయెన్సర్ మొహమ్మద్ జుబైర్ అలీ స్థాపించిన ఈ వేదిక, గత ఏడేళ్లుగా క్రియేటర్లకు నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌గా సేవలందిస్తోంది.
ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా బ్లాగర్లు ఇన్‌ఫ్లూయెన్సర్లు పాల్గొన్నారు. ఒకప్పుడు కేవలం ఫుడ్ కంటెంట్‌కే పరిమితమైన ఈ వేదిక, ఇప్పుడు ఫ్యాషన్, లైఫ్‌స్టైల్, పేరెంటింగ్, టెక్నాలజీ, ఆటోమొబైల్ ట్రావెల్ వంటి విభిన్న రంగాలపై ఫోకస్ చేసిందని జుబైర్ తెలిపారు. ఇది హైదరాబాద్ డిజిటల్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు. గడిచిన ఏడేళ్లలో, హైదరాబాద్ ఇన్‌స్టా మీట్ 70కి పైగా ప్రముఖ బ్రాండ్లతో భాగస్వామ్యం కుదుర్చుకుందని వెల్లడించారు
