
మేడ్చల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులపై ఎనిమిదో వార్డు కౌన్సిలర్ నాగరాజు దౌర్జన్యం చేశాడు. నాగరాజు అలియాస్ చాపరాజు సీఎం నియోజకవర్గంలోని మనోరాబాద్ ఎంపీపీని అంటూ మరో వ్యక్తి పోలీసులపై దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు అయితే ఏం చేస్తారు అంటూ మనోహరాబాద్ ఎంపీపీ భర్త రవి, మేడ్చల్ కౌన్సిలర్ చాపరాజు, రామాయపల్లి MPTC మరిది శ్రీనివాస్ గౌడ్ బెదిరింపులకు దిగారు. ఈ తతంగం అంతా వీడియో తీస్తున్న సబ్ ఇన్ స్పెక్టర్ ఫోన్ ని లాక్కుని ముగ్గురు నేతలు ఇష్టమొచ్చినట్టు దుర్భాషలాడారు.
అర్థరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులను చూసి వాహనం యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేడయంతో అనుమానం వచ్చి కారును ఆపేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడానికి ప్రయత్నిస్తే పోలీసులపైనే దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు అయితే ఏం చేస్తారంటూ చాలా ర్యాష్ గా మాట్లాడారు. మద్యం సేవించనప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కు ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. పూటుగా మద్యం సేవించి ఎక్కడ దొరికిపోతావేమో అనే భయంతో తమకు సహకరించడం లేదని పోలీసులు చెబుతున్నారు.
మేడ్చల్ జాతీయ రహదారిపై పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా ఓ కారులో ప్రయాణిస్తున్న వారు పోలీసులను చూసి పక్కకు అపుకున్నారు. ఇది గమనించిన ట్రాఫిక్ ఎస్ఐ వారి దగ్గరికి వెళ్లి మీరు మందు తాగి వాహనం నడుపుతున్నారు. మీరు బ్రీత్ లేజర్ లో ఊదాలని కోరాడు. అంతే ఆ కారులో ఉన్న వారు మేడ్చల్ మున్సిపాలిటీకి చెందిన 8వ వార్డు కౌన్సిలర్ (కాంగ్రెస్) నాగరాజు, మనోహరాబాద్ టీఆర్ఎస్ ఎంపీపీ భర్త రవి ముదిరాజ్ నానా హంగామా సృష్టించారు.
తాను సీఎం కేసీఆర్ నియోజకవర్గానికి చెందిన ఎంపీపీ భర్తను..మీరు కారును ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ ఎలా నిర్వహిస్తారని పోలీసులపై రవి దురుసుగా ప్రవర్తించాడు. తాము తలుచుకుంటే ఏదైనా చేయొచ్చని, పోలీసులు వీడియో తీస్తున్న ఫోనును లాక్కొని ఓగంటసేపు వీరంగం సృష్టించారు. ఈ ఘటనపై మేడ్చల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ నర్సింహారెడ్డి తెలిపారు.