శివసేన పార్టీ కొత్త భవనం... కేవలం ఊహాగానాలే

శివసేన పార్టీ కొత్త భవనం... కేవలం ఊహాగానాలే

మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని  పక్కకు నెట్టేసి... బీజేపీతో జతకట్టి... మరాఠా పీఠంపై కొలువు దీరిన రెబల్ లీడల్ ఏక్ నాథ్ షిండే మరో కీలక నిర్ణయానికి పూనుకున్నట్టు తెలుస్తోంది. శివసేన పార్టీ కోసం కొత్త భవనం కట్టేందుకు ఆయన ప్రణాళికలు రచిస్తున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. దాని కోసం మహారాష్ట్రలోని దాదర్ లోని ప్రస్తుత శివసేన భవన్ కు సమీపంలోనే కొత్త భవనం నిర్మించాలని యోచిస్తుందని తెలుస్తోంది. కానీ దానికి స్థలం ఇంకా కన్మర్మ్ కాలేది...  స్థలం కోసం వెతుకుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.

అయితే ఈ ప్రచారంపై తాజాగా కొత్తగా చేరిన మహారాష్ట్ర మంత్రి స్పందించారు. అవన్నీ కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేశారు. దాదర్‌లో శివసేన భవన్‌ నిర్మాణం జరుగుతోందనేదని అపోహేనని, అయితే సీఎం సామాన్య ప్రజలను కలిసేందుకు వీలుగా కేంద్ర కార్యాలయం కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. శివసేన భవన్‌ను తాము గౌరవిస్తున్నామని, అది అలాగే ఉంటుందని ఆయన అన్నారు. ఇకపోతే అసలైన శివసేన పార్టీ తమదేనంటూ ఓ వైపు షిండే.. మరోవైపు థాక్రేలు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన కోర్టు .... ఈ విషయంపై ఇప్పుడే ఎలాంటి నిర్ణయమూ తీసుకోరాదని ఈసీని ఆదేశించింది.