
కన్నకొడుకులు పట్టించుకోవడం లేదని పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు ఓ వృద్ధ దంపతులు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. చొప్పదండి పట్టణానికి చెందిన గజ్జల రాజయ్య, రుక్కమ్మ అనే వృద్ద దంపతులకు ఇద్దరు కొడుకులు. కొన్ని రోజులుగా తమను పట్టించుకోవడం లేదని..తిండి కూడా పెట్టడం లేదని పోలీసులను ఆశ్రయించారు దంపతులిద్దరు. దీంతో కొడుకులిద్దర్నీ పోలీస్ స్టేషన్ కు పిలిపించిన పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చార సీఐ నాగేశ్వరరావు. తల్లిదండ్రులను పట్టించుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.