
పెద్దపల్లి: వృద్ధుడిని దారుణంగా చంపిన సంఘటన శనివారం పెద్దపల్లి జిల్లాలో జరిగింది. గోదావరిఖని , ప్రశాంత్ నగర్ కు చెందిన బండారి మెగిలి(68) ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి, డెడ్ బాడీని ప్రశాంత్ నగర్ చెరువు కట్ట దగ్గర పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కోసం హాస్పిటల్ కి తరలించారు. భూమి తగాదాలతో మెగిలిని హత్య చేసి ఉంటారని స్థానికుల ద్వారా తెలుసుకున్న పోలీసులు .. ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.