అమెజాన్ కస్టమర్ కేర్ అని ఫోన్ చేసి..వృద్ధురాలి నుంచి రూ.లక్ష కాజేసిన స్కామర్

అమెజాన్ కస్టమర్ కేర్ అని ఫోన్ చేసి..వృద్ధురాలి నుంచి రూ.లక్ష కాజేసిన స్కామర్
  • వృద్ధురాలి నుంచి రూ.లక్ష కాజేసిన స్కామర్​

బషీర్​బాగ్, వెలుగు: అమెజాన్ కస్టమర్​కేర్​ నంబర్​ అని ఫోన్​ చేస్తే లైన్​లోకి వచ్చిన స్కామర్​ఓ వృద్ధురాలి బ్యాంక్​అకౌంట్ల నుంచి రూ.లక్ష కాజేశాడు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన  ప్రకారం.. సికింద్రాబాద్ కు చెందిన వృద్ధురాలు ఇటీవల అమెజాన్ లో ఒక వస్తువు కొనుగోలు చేసింది. దాన్ని రిటర్న్ చేసి, మనీ రీఫండ్ ప్రాసెస్ తెలుసుకునేందుకు గూగుల్ లో అమెజాన్ కస్టమర్ కేర్ నంబర్ కోసం సెర్చ్ చేసింది.  

ఫేక్ కస్టమర్ కేర్ నంబర్​కు కాల్ చేసింది. దీపక్ శుక్లాగా పరిచయం చేసుకుని స్కామర్ రిఫండ్ ప్రాసెస్ కు  ఫోన్​ స్క్రీన్ షేరింగ్ చేయాలని ఆమె కు సూచించాడు. బాధితురాలు అలాగే చేయడంతో.. ఆమె అమెజాన్ అకౌంట్ తో పాటు గూగుల్ పే ను యాక్సెస్ చేశాడు. బ్యాంక్ అకౌంట్ వివరాలు  తెలుసుకొని, ఆమె ఎస్​బీఐ , యూనియన్ బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.1,07,621 కాజేశాడు.  మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు.