హుజురాబాద్‌ పోలింగ్.. 20 కంపెనీల కేంద్ర బలగాలు

హుజురాబాద్‌ పోలింగ్.. 20 కంపెనీల కేంద్ర బలగాలు

హుజురాబాద్ లో అంతా గప్ చుప్ అయ్యింది. ఇన్నాళ్లు ప్రచారంతో హోరెత్తించిన మైకులు బంద్ అయ్యాయి. హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 30 న ఉప ఎన్నికలు జరగనున్నాయి. కరోనా నిబంధనల కారణంగా 72 గంటల ముందు ప్రచారాన్ని క్లోజ్ చేయాలని ఆదేశించింది ఈసీ. ఇతర  ప్రాంతాల నుంచి ప్రచారానికి వెళ్లిన నాన్ లోకల్ లీడర్లంతా నియోజకవర్గాన్ని ఖాళీ చేశారు. శనివారం పోలింగ్ జరగనుండగా... నవంబర్ 2 న ఓట్ల లెక్కింపు ఉండనుంది.   ఎన్నికల ప్రచారం ముగియడంతో ఆఖరి యత్నాల్లో ఉన్నాయి పార్టీలు.

30 న జరిగే పోలింగ్ కు ఏర్పాటు చేస్తున్నారు ఈసీ అధికారులు. ఇప్పటికే రాష్ట్ర పోలీస్ బలగాలతో పాటు.. 20 కంపెనీల కేంద్ర బలగాలు బై పోల్ విధుల్లో ఉన్నాయి. హుజురాబాద్ లో మొత్తం 2 లక్షల 36 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇందుకోసం 306 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 30 వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 వరకు పోలింగ్ జరగనుంది. 

హుజురాబాద్ ఎన్నికల ఓటర్ అప్డేట్

  • మొత్తం పోలింగ్ కేంద్రాలు            306
  • పురుష ఓటర్లు                          1,17,933.
  • మహిళ ఓటర్లు                          1,19012.
  • ట్రాన్స్ జెండర్                            1
  • ఎన్ ఆర్ ఐ ఓటర్లు                      14
  • పోస్టల్ బ్యాలెట్                          758.
  • 18-19 ఏండ్ల ఓటర్లు                   5,165
  • 80 ఆపై వయస్సు ఓటర్లు           4,454
  • మొత్తం ఓటర్లు                          2,37,036

హుజురాబాద్ ఎన్నికలకు రెడీ అయ్యింది ఎన్నికల సంఘం. శనివారం పోలింగ్ ఉండటంతో.. అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్. కరీంనగర్, హన్మకొండ కలెక్టర్ లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఎక్సైజ్, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పోలింగ్, మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ పై అధికారులతో మాట్లాడారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పారు.