రాజాసింగ్పై కేసు నమోదుకు ఈసీ ఆదేశం

రాజాసింగ్పై కేసు నమోదుకు ఈసీ ఆదేశం

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదుచేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేసింది. రాజాసింగ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, మీడియాతో మాట్లాడటంపై కూడా ఈసీ నిషేధం విధించింది. యూపీ ఓటర్లను బెదిరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఈసీ  షోకాజ్ నోటీసు జారీ చేసినా రాజాసింగ్ స్పందించలేదు. వివరణ ఇచ్చేందుకు శనివారం మధ్యాహ్నం వరకు గడువు ఇచ్చినా ఆయన నుంచి సమాధానం రానందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. రాజాసింగ్ చెప్పుకునేందుకు ఏమీ లేదని భావిస్తున్నామని, అందుకే ఈసీ తగిన చర్యలు తీసుకుంటుందని చెప్పింది. 

ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో యూపీలో హిందువులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల తర్వాత యోగికి ఓటేయనివారిని గుర్తించి వారి ఇళ్లను బుడ్జోజర్లతో కూలుస్తామని వార్నింగ్ ఇచ్చారు. రాజాసింగ్ వ్యాఖ్యలపై ఫిర్యాదు అందడంతో ఎలక్షన్ కమిషన్ షోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఆయన నుంచి స్పందన లేకపోవడంతో కేసు నమోదుచేయాలని ఆదేశించింది.