ప్రేమించిన యువకుడిపై కేసు..యువతి సూసైడ్..హనుమకొండ జిల్లా రాంపూర్లో ఘటన

ప్రేమించిన యువకుడిపై కేసు..యువతి సూసైడ్..హనుమకొండ జిల్లా రాంపూర్లో ఘటన

ధర్మసాగర్, వెలుగు : హనుమకొండ జిల్లాకు చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ధర్మసాగర్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన ఆడెపు రమ, రాజమౌళి దంపతుల కూతురు అనూష(22), హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తుండగా.. వరంగల్ కు చెందిన గుర్రపు పవన్ కుమార్ ప్రేమించుకున్నారు. వీరి పెండ్లికి ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయి. కాగా.. వరంగల్ కు చెందిన మరో యువతి హైదరాబాద్​లో జాబ్ చేస్తూ రెండు నెలల కింద హాస్టల్ లో ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతికి పవన్ కుమార్ నే కారణమని పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది తెలిసిన అనూష రెండు నెలల కింద ఇంటికి వెళ్లింది. అప్పటినుంచి తీవ్ర మనోవేదన చెందుతూ బుధవారం ఉదయం వంటగదిలో చున్నితో ఉరేసుకుని చనిపోయింది. మృతురాలి తల్లి ఆడెపు రమ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్​స్పెక్టర్ శ్రీధర్ రావు తెలిపారు.