మళ్ళీ వాయిదా ప‌డిన‌ నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

మళ్ళీ వాయిదా ప‌డిన‌ నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మరోసారి వాయిదా పడింది. లాక్‌డౌన్ కారణంగా ఎన్నికను 45 రోజుల పాటు వాయిదా వేస్తూ కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆగస్ట్ మొదటి వారంలో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక జరిగే అవకాశం వుంది. కరోనా కారణంగా ఇప్పటికే ఒకసారి ఎన్నిక వాయిదా పడింది. నిజామాబాద్ స్థానిక సంస్థలఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా మార్చి 18న మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి సుభాష్ రెడ్డి, బీజేపీ నుంచి లక్ష్మీనారాయణ బరిలో నిలిచారు. మొత్తం ఏడుగురు అభ్యర్థులు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికలో భాగంగా నామినేషన్లు వేశారు.