ఎంత గొప్ప మనసో పాపం..! భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి చేసిన భర్త.. ఆ తర్వాత ఇంటికెళ్లి...

ఎంత గొప్ప మనసో పాపం..! భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి చేసిన భర్త.. ఆ తర్వాత ఇంటికెళ్లి...

మానవ సంబంధాలు రానురానూ దిగజారిపోతున్నాయి.. తమ స్వార్థం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు జనం. డబ్బు కోసం, ప్రేమ కోసం సొంతవారిని సైతం హతమార్చడానికి వెనకాడనివారు చాలా మంది ఉన్నారు. వివాహేతర సంబంధాల కారణంగా కట్టుకున్న వారిని విచక్షణారహితంగా చంపేసిన ఘటనలు చాలానే చూశాం.. అయితే.. ఖమ్మం జిల్లాలో ఓ వ్యక్తి చేసిన పని గురించి తెలిస్తే ఎంత కఠినమైన మనసైన చలించక మానదు. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి చేసి.. ఆ తర్వాత ఇంటికెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ భర్త. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 

ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి చెందిన షేక్ గౌస్ కు ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది.బ్రతుకు తెరువు కోసం దగ్గరలోని ఓ గ్రామానికి వెళ్లి ఆటో నడుపుకొని జీవనం సాగిస్తున్నాడు.అయితే తన స్నేహితుడితో భార్య ప్రేమలో పడింది.ఈ విషయం తెలుసుకున్న గౌస్ తన భార్యకు,ఆమె ప్రియుడికి హిందూ సంప్రదాయంలో తాళి కట్టి దగ్గరుండి పెళ్లి చేయించాడు. అనంతరం సత్తుపల్లి లోని తన ఇంటికి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.గౌస్ దంపతులకు ముగ్గురు సంతానం.

ALSO READ : హైదరాబాద్ నాగోల్ లో స్కూల్ ముందు తెగిపడిన కరెంటు వైర్లు...

తల్లి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవటం,తండ్రి ఆత్మహత్య కు పాల్పడటంతో ముగ్గురు చిన్నారులు అనాథులుగా మారారు. గొప్ప మనసుతో భార్యకు ఆమె ప్రియుడితో వివాహం చేసిన గౌస్.. మనసు రాయి చేసుకొని అయినా.. ముగ్గురు చిన్నారుల కోసమైనా గౌస్ బతికి ఉండాల్సిందని విచారం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్థులు. అయితే కుటుంబ కలహాల కారణంగా గౌస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.