హైదరాబాద్: ఏపీ ప్రతిపాదిత బనకచర్ల ప్రాజెక్ట్ వ్యవహరంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు డీపీఆర్ టెండర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. తెలంగాణ ప్రభుత్వ పోరాటంతో ఏపీ సర్కార్ వెనక్కి తగ్గింది. బనకచర్ల డిటెయిల్డ్ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్) తయారీ కోసం ఏపీ ప్రభుత్వం 2025, అక్టోబర్ 8న టెండర్లను పిలిచింది. అదే రోజు నుంచి సంస్థలకు టెండర్ డాక్యుమెంట్ అందుబాటులో ఉంచింది.
2025, అక్టోబర్ 22 ఉదయం 11 గంటల వరకు టెండర్ డాక్యుమెంట్లను సమర్పించేలా గడువు విధించింది. టెండర్డిపాజిట్రూ.7.75 లక్షలుగా పేర్కొన్న ఏపీ.. పని విలువను రూ.9.2 కోట్లుగా వెల్లడించింది. ఈ క్రమంలో ఎట్టిపరిస్థితుల్లో బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దంటూ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ లేఖ రాసింది. చివరకు తెలంగాణ ప్రభుత్వ పోరాటంతో బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ టెండర్ల విషయంలో ఏపీ వెనక్కి తగ్గింది.
బనకచర్ల విషయంలో ఏపీ దూకుడుపై తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ ఆందోళన వ్యక్తం చేస్తున్నది. బనకచర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వవద్దని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్‌శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి కేంద్రానికి లేఖలు రాయడంతో పాటు.. రెండు రాష్ట్రాల సీఎంలతో కేంద్రం ఏర్పాటు చేసిన మీటింగులోనూ పాల్గొన్నారు. ఆనాడు లోపల బనకచర్ల గురించి చర్చ జరగలేదని చెప్పినా.. ఏపీ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు బయట మీడియాతో బనకచర్లను కట్టితీరుతామని చెప్పారు.
ఇప్పుడు ఆ వ్యవహారం డీపీఆర్తయారీకి టెండర్ల వరకు వచ్చింది. దీంతో ఈ వ్యవహారంపై ఈఎన్సీ జనరల్పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ)తో పాటు సెంట్రల్వాటర్కమిషన్(సీడబ్ల్యూసీ)కు ఫిర్యాదు చేశారు. టెండర్ల ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని డిమాండ్‌చేశారు. ఏపీ అక్రమంగా ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రాజెక్టు చేపడ్తోందని, వరద జలాల కాన్సెప్టే లేనప్పుడు దాని ఆధారంగా ఎలా ప్రాజెక్టును చేపడతారని ప్రశ్నించారు. వెంటనే టెండర్ల ప్రక్రియను ఆపడంతో పాటు ముందుకు వెళ్లకుండా ఏపీని కట్టడి చేయాలని కోరారు.
