ముంబై: 2026 మెగా వేలానికి ముందు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ఫ్రాంచైజీలు ఆటగాళ్ల రిటెన్షన్ లిస్ట్‌ను విడుదల చేశాయి. డబ్ల్యూపీఎల్‌లోని ముంబై, బెంగుళూర్, గుజరాత్, ఢిల్లీ, యూపీ ఐదు ఫ్రాంచైజీలు తమతో అట్టిపెట్టుకున్న ఆటగాళ్ల వివరాలను గురువారం (నవంబర్ 6) వెల్లడించాయి. ఉమెన్స్ వరల్డ్ కప్ విశ్వవిజేతగా నిలిచిన ఇండియా జట్టులోని చాలా మంది ప్లేయర్లను ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్నాయి.
హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మందనా, రిచా ఘోష్, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, షఫాలి వర్మ, అమన్ జ్యోత్ కౌర్‌ను ఆయా ఫ్రాంచైజీలు తమతోనే అట్టిపెట్టుకున్నాయి. ఓవరాల్‌గా ఢిల్లీ, ముంబై ఐదుగురిని, బెంగుళూర్ నలుగురిని, గుజరాత్ ఇద్దరిని, యూపీ ఒక్కరి చొప్పున రిటైన్ చేసుకున్నాయి. అయితే.. గుజరాత్, యూపీ జట్లు అనూహ్య నిర్ణయం తీసుకున్నాయి.
►ALSO READ | IND vs AUS: సుందర్, అక్షర్ స్పిన్ మ్యాజిక్.. నాలుగో టీ20లో ఆస్ట్రేలియాను చిత్తు చేసిన టీమిండియా
వన్డే ప్రపంచ కప్ సెమీ-ఫైనల్, ఫైనల్‌లో వరుసగా సెంచరీలు చేసిన దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్, సెమీస్‌లో భారత్‌పై శతకం బాదిన ఆస్ట్రేలియా ప్లేయర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్‌ను గుజరాత్ వేలానికి వదిలేసింది. గతేదాడి దారుణ ప్రదర్శన కనబర్చిన యూపీ జట్టు ప్రక్షాళనకు పూనుకుంది. ఇందులో భాగంగా టీమిండియా వరల్డ్ కప్ గెలవడంలో కీ రోల్ ప్లే చేసిన స్టార్ ఆల్ రౌండర్ దీప్తి శర్మతో పాటు స్టార్ ప్లేయర్స్ సోఫీ ఎక్లెస్టోన్, చెనిల్లే హెన్రీ, అలానా కింగ్ వంటి వారిని రిటైన్ చేసుకోలేదు.
ముంబై రిటైన్ లిస్ట్:
- నాట్ స్కైవర్-బ్రంట్ 3.5 కోట్లు
- హర్మన్‌ప్రీత్ కౌర్ 2.5 కోట్లు
- హేలీ మాథ్యూస్ 1.75 కోట్లు
- అమన్‌జోత్ కౌర్ 1 కోటి
- జి కమిలిని 50 లక్షలు
ఢిల్లీ క్యాపిటల్స్ రిటెన్షన్ లిస్ట్:
- జెమిమా రోడ్రిగ్స్ 2.2 కోట్లు
- మారిజాన్ కాప్ 2.2 కోట్లు
- షఫాలీ వర్మ 2.2 కోట్లు
- అన్నాబెల్ సదర్లాండ్ 2.2 కోట్లు
- నికి ప్రసాద్ 50 లక్షలు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటెన్షన్ లిస్ట్:
- స్మృతి మంధాన 3.5 కోట్లు
- రిచా ఘోష్ 2.75 కోట్లు
- ఎల్లీస్ పెర్రీ 2 కోట్లు
- శ్రేయంక పాటిల్ 60 లక్షలు
గుజరాత్ జెయింట్స్ రిటెన్షన్ లిస్ట్:
- ఆష్లీ గార్డనర్ రూ. 3.5
- బెత్ మూనీ 2.5 కోట్ల రూపాయలు
UP వారియర్జ్ రిటెన్షన్ లిస్ట్:
- శ్వేతా సెహ్రావత్ 50 లక్షలు
