TTD భక్తులకు బిగ్ అప్డేట్: అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో కీలక మార్పు

TTD భక్తులకు బిగ్ అప్డేట్: అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో కీలక మార్పు

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అంగప్రదక్షిణ టోకెన్ల జారీ విధానంలో కీలక మార్పు చేపట్టింది. ప్రస్తుతం అమల్లో ఉన్న లక్కీ డిప్ విధానాన్ని రద్దు చేసి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ (FIFO) పద్ధతిలో టోకెన్లు కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. అంగప్రదక్షిణ టోకెన్లు మూడు నెలల ముందుగానే ఆన్‌లైన్‌లో విడుదల అవుతాయని తెలిపింది. ఈ మార్పును గమనించి అంగప్రదక్షిణ టోకెన్లు బుక్ చేసుకోవాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది. కాగా, అంగప్రదక్షిణం అంటే.. దేవునిపై భక్తితో శరీరాన్ని నేలపై దొర్లించుకుంటూ చేసే ప్రదక్షిణ.