- ‘సర్’ ఫస్ట్ ఫేజ్ తర్వాత లిస్ట్ విడుదల
చెన్నై: తమిళనాడులో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఫస్ట్‌ఫేజ్ పూర్తయిన తర్వాత ఓటర్ల జాబితా నుంచి 97.37 లక్షల మంది పేర్లను ఎన్నికల సంఘం(ఈసీ) తొలగించింది. ఇందులో 26.94 లక్షల మరణించిన వారి పేర్లు కాగా.. 66.44 లక్షల మంది ఇతర ప్రాంతాలకు మారినవారు, 3.39 లక్షల మందివి డూప్లికేట్ ఎంట్రీలుగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
ఈ రివిజన్‌కు ముందు రాష్ట్రంలో 6.41 కోట్ల ఓటర్లు ఉండగా, ఇప్పుడు 5.43 కోట్లకు తగ్గింది. చెన్నైలోనే 14.25 లక్షల పేర్లు తొలగించారు. కోయంబత్తూరులో 6.5 లక్షలు, కాంచీపురంలో 2.74 లక్షలు తీసివేశారు. ఈ ప్రక్రియపై డీఎంకే–-కాంగ్రెస్ కూటమి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా, అన్నా డీఎంకే మాత్రం మద్దతు తెలిపింది. తొలగించిన పేర్లలో ఉన్నవారు ఓటు హక్కు కోసం జనవరి 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఈసీ తెలిపింది.
