జేబులో రూ.10 వేలకు మించి ఉండొద్దు

జేబులో రూ.10 వేలకు మించి ఉండొద్దు

    ఇది ఏజెంట్లకూ వర్తిస్తది

    మున్సిపల్​ఎన్నికల్లో ఎలక్షన్​కమిషన్​రూల్స్​ 

    స్పెషల్​ అకౌంట్ ఓపెన్​చేసి ట్రాన్సాక్షన్స్​ చేయాలె

    రూ.5వేల వరకే

    క్యాష్​ఇచ్చే చాన్స్​

మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసే క్యాండిడేట్లు తమ వెంట రూ.10 వేలకు మించి క్యాష్​ ఉంచుకోవద్దని చెప్తోంది స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌. క్యాండిడేట్లే కాదు వారి ఎన్నికల ఏజెంట్లూ తమ వెంట అంతకు మించి నగదు ఉంచుకోకుండా చూసుకోవాలని స్పష్టం చేసింది. నామినేషన్‌ నుంచి రిజల్ట్స్​ప్రకటించేంత వరకు ఎన్నికల ఖర్చు కోసం స్పెషల్​అకౌంట్​క్రియేట్​చేసి దాని ద్వారానే ట్రాన్సాక్షన్స్​ చేయాల్సి ఉంటుంది. నామినేషన్‌కు ఒక రోజు ముందే ఆ అకౌంట్‌ తెరవాలి. తెలంగాణ మున్సిపల్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 343 జెడ్‌సీ (1, 2) లో దీన్ని మెన్షన్​ చేశారు. అకౌంట్ నంబర్‌ను సంబంధిత రిటర్నింగ్‌ ఆఫీసర్​అయిన కార్పొరేషన్‌, మున్సిపల్​కమిషనర్‌కు అందజేయాలి. అకౌంట్‌ క్యాండిడేట్‌ పేరుతో గానీ, అతని ఎన్నికల ఏజెంట్లతో గాని జాయింట్‌ అకౌంట్‌గానూ తీసుకోవచ్చు. క్యాండిడేట్‌తో పాటు అతడి కుటుంబసభ్యులు కలిపి తీసుకున్న అకౌంట్‌ను అనుమతించరు.

నంబర్​ ఇవ్వకపోతే నోటీసులు

క్యాండిడేట్​పోటీ చేస్తున్న మున్సిపాలిటీ ఏ జిల్లా పరిధిలో ఉంటుందో ఆ జిల్లాలో ఎక్కడి నుంచైనా అకౌంట్‌ తెరవొచ్చు. కో ఆపరేటివ్‌ బ్యాంక్‌తో పాటు పోస్టాఫీస్‌ అకౌంట్లనూ ఇందుకు అనుమతిస్తారు. అకౌంట్‌ నంబర్‌ ఇవ్వని క్యాండిడేట్లకు సంబంధిత రిటర్నింగ్‌ అధికారి నోటీసులు జారీ చేస్తారు. కానీ ఈ కారణంతో క్యాండిడేట్​నామినేషన్‌ను తిరస్కరించే అవకాశం లేదు. ఎన్నికల ఫలితాలు ప్రకటించిన 45 రోజుల తర్వాత ఖర్చుల వివరాలు సమర్పిచాలి.

క్యాష్​ రూపంలో రూ.5వేల వరకే..

క్యాండిడేట్లు ఎన్నికల సమయంలో చేసే చెల్లింపుల్లో రూ.5 వేల లోపు మాత్రమే క్యాష్​ రూపంలో చేయాలి. అంతకుమించి ఉంటే అకౌంట్‌ పే చెక్‌, డీడీ, ఆర్టీజీఎస్‌, నెఫ్ట్‌ రూపంలోనే చేయాలి. ఎవరైనా ఇలా చేయకపోతే ఆ అభ్యర్థి స్టేట్​ ఎన్నికల కమిషన్​చెప్పిన రూల్స్​ ప్రకారం అకౌంట్​ నిర్వహించలేదని భావిస్తారు.

మరిన్ని వెలుగు వార్తలకు క్లిక్ చేయండి