తెలంగాణలోనూ ‘సర్’..! 2002, 2025 ఓటర్ లిస్టుల మ్యాచింగ్కు ఈసీ ఆదేశాలు

తెలంగాణలోనూ ‘సర్’..! 2002, 2025 ఓటర్ లిస్టుల మ్యాచింగ్కు ఈసీ ఆదేశాలు
  • జిల్లాల్లో 5 రోజులుగా అదేపనిలో ఉన్న రెవెన్యూ అధికారులు 
  • 22న కలెక్టర్లకు, 24న సీఈవో, 26న ఈసీఐ చేతికి జాబితా  

మంచిర్యాల, వెలుగు: ఓటర్ల జాబితా సవరణ కోసం స్పెషల్ ఇంటెన్సివ్ ​రివిజన్(సర్)ను దేశవ్యాప్తంగా అమలు చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహా లు ప్రారంభించింది. ఈ నెల11న ఢిల్లీలో రాష్ర్ట ఎన్నిక ల అధికారులతో నిర్వహించిన సన్నాహక సమావే శంలో దీనిపై ఈసీఐ సంకేతాలు ఇచ్చింది. సర్​లో భాగంగా సన్నద్ధతా చర్యలు (ప్రీ సర్ యాక్టివిటీ) చేప ట్టాలని ఆదేశించింది. ఈ మేరకు 2002, 2025 ఓటర్ లిస్టులను మ్యాచింగ్ చేయాలని ఈ నెల 15న రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. 

గత 5 రోజులుగా రెవెన్యూ అధికారులు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. 2002, 2025 ఓటర్ లిస్టులను నియోజకవర్గాలు, పోలింగ్ స్టేషన్ల వారిగా మ్యాచింగ్ చేసి అందులో ఎంతమంది ఓటర్లు మ్యాచ్ అవుతున్నారో లిస్టు తయారుచేసి ఈ నెల 22న కలెక్టర్లకు సమర్పించాలని ఈసీ సూచించింది. కలెక్టర్లు అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా లిస్టు రెడీ చేసి 24న రాష్ట్ర ఎన్నికల సంఘానికి అందజేస్తే.. 26న కేంద్ర ఎలక్షన్ కమిషన్​కు సమర్పించాల్సి ఉంటుంది.  

ప్రీ సర్​యాక్టివిటీ ఇలా..

కేంద్ర ఎన్నికల సంఘం సర్ ప్రక్రియను ప్రీ సర్ యాక్టివిటీ, పోస్ట్ సర్ యాక్టివిటీగా విభజించింది. ప్రీ సర్ యాక్టివిటీలో భాగంగా -2002 ఓటర్​ లిస్టులో 40 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రస్తుత ఓటర్లను 2025 ఓటర్ లిస్టుతో మ్యాపింగ్ చేస్తున్నారు. ఇందులో కంట్రోల్ టేబుల్ మ్యాపింగ్​లో 2002, 2025 ఎలక్టోరల్ లిస్టు ప్రకారం.. జిల్లా, అసెంబ్లీ సెగ్మెంట్ నంబర్, సెగ్మెంట్ పేరు, పోలింగ్ స్టేషన్ల సంఖ్య, రెవెన్యూ డివిజన్, మండలం, గ్రామం వివరాలు నమోదు చేస్తున్నారు. 

అలాగే ఎలక్టర్ మ్యాపింగ్ టేబుల్(ఎలక్టర్ డేటా మ్యాపింగ్)​లో 2025 ఓటర్ లిస్టు ప్రకారం.. ఎపిక్​నంబర్, అసెంబ్లీ సెగ్మెంట్ నంబర్, పార్ట్ నంబర్, పార్ట్​లో సీరియల్ నంబర్, 2002 ఓటర్ లిస్టు ప్రకారం.. ఓల్డ్ స్టేట్ కోడ్ నంబర్, ఓల్డ్ సెగ్మెంట్ నంబర్, ఓల్డ్ పార్ట్ నంబర్, ఓల్డ్ పార్ట్ సీరియల్ నంబర్, ఓల్డ్ ఎపిక్ నంబర్ వివరాలు నమోదు చేస్తున్నారు. అంతేగాకుండా పోలింగ్ స్టేషన్ల వారిగా 2002 ఎలక్టర్​ స్టాటిస్టిక్ రిపోర్ట్​లో.. ఓల్డ్ అసెంబ్లీ సెగ్మెంట్ నంబర్, ఓల్డ్ పార్ట్ నంబర్, 2002లో ఓటర్ల సంఖ్య, వారిలో ప్రస్తుత జాబితాలో ఎంత మందిని గుర్తించారు? ఎంత మంది ఓటర్లు మరణించారు? జాడలేని వారు ఎంతమంది? వంటి వివరాలతో లిస్టు రెడీ చేస్తున్నారు.  

తర్వాత హౌస్ టు హౌస్ సర్వే.. 

ఈసీ సర్​కు ఆదేశాలు జారీ చేస్తే.. బూత్ లెవల్ ఆఫీసర్(బీఎల్ఓ)ల ద్వారా హౌస్ టు హౌస్​సర్వే చేపట్టనున్నారు. ఇందుకోసం వారికి ఐడెంటిటీ కార్డులు సైతం జారీ చేస్తారు. అవసరమైతే కొత్త బీఎల్ఓలకు ట్రైనింగ్ ఇచ్చి సర్ కార్యకలాపాల్లో నియమించుకుంటారు. ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, బీఎల్ఓ సూపర్​వైజర్లు, ఎలక్షన్ డీటీలు, ఏసీలను సర్​లో భాగస్వామ్యం చేయాలని ఇప్పటికే ఈసీఐ సంకేతాలు ఇచ్చింది. 

తద్వారా ఓటర్ లిస్టును కచ్చితత్వంతో సవరించడం, నకిలీ, బోగస్ ఓటర్ల తొలగింపు, మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉంది. 2002 ఓటర్ లిస్టులో ఉన్న చాలామంది 2025 జాబితాలో లేరు. వీరిలో కొందరు చనిపోగా, మరికొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. ప్రస్తుతం ఈ రెండు లిస్టుల్లో ఎంతమంది ఓటర్లు మ్యాచింగ్ అవుతున్నారనే వివరాలకే ఈసీఐ పరిమితమైంది.