పకడ్బందీగా ఎన్నికల డ్యూటీ చేయాలి :మెదక్​ కలెక్టర్​ రాజర్షి షా

 పకడ్బందీగా ఎన్నికల డ్యూటీ చేయాలి :మెదక్​ కలెక్టర్​ రాజర్షి షా

మెదక్ టౌన్, వెలుగు :  ఎన్నికల విధులను అధికారులు పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని మెదక్​ కలెక్టర్​ రాజర్షి షా సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్గరేట్​కాన్ఫరెన్స్​ హాల్​లో ఎన్నికల  నిర్వహణపై  ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్వో, ఏఆర్వోలు, సెక్టార్ అధికారుల పాత్ర కీలకమన్నారు. మెదక్  లో31, నర్సాపూర్ లో 33 సెక్టార్ అధికారులను  నియమించామని,  అదనంగా మరో ఆరుగురు  సెక్టార్​ అధికారులను అందుబాటులో ఉంచామని చెప్పారు. ఈనెల 26, 27, సెప్టెంబర్  2, 3న  ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం ఉంటుందని తెలిపారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఏపీఎంలు, సెల్ఫ్​హెల్ప్​ గ్రూపులతో  ఓటర్ అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు.  జిల్లాలో  579 పోలింగ్​స్టేషన్లు ఉన్నాయని, వాటిలో  మౌలిక  సదుపాయాలు పరిశీలించాలని ఈఆర్​వోలు, ఏఈఆర్​వోలు, సూపర్​వైజర్లను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్​ కలెక్టర్​ వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు అంబదాస్​ రాజేశ్వర్, జయచంద్రారెడ్డి, ఎన్నికల సమన్వకర్త రాజిరెడ్డి, తహసీల్దార్లు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.అనంతరం ఆర్డీవోలు, తహసీల్దార్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్​ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ధరణి పెండింగ్ దరఖాస్తులను, గృహలక్ష్మి దరఖాస్తులను వేగంగా పరిశీలించాలని ఆదేశించారు.